వెంచర్ అంటే వ్యాపారం కాదు.. సామాజిక బాధ్యత
గజ్వేల్, సెప్టెంబర్13: ఎన్‌సీఆర్(NCR) ద్వారక వెంచర్‌లో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సిద్ధి వినాయక మండపాన్ని ఆదివారం వైభవంగా ప్రారంభించారు. కీర్తిశేషులు ఎన్‌సీ రాజయ్య జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మండపాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంచర్ అంటే కేవలం వ్యాపారం కాదని, సామాజిక బాధ్యతతో కాలనీవాసుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వికాసానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్‌సీ సంతోష్ మాట్లాడుతూ ద్వారక వెంచర్‌ను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. కార్యక్రమంలో ఉప్పల మెట్టయ్య, ఎన్‌సీ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి సంతోష్, కోశాధికారి కనకయ్య, రాజశ్రీ అపార్ట్‌మెంట్ సభ్యులు, ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్, లయన్స్ క్లబ్, ఆర్యవైశ్య నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.