ఆప్ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

23-11-2026 | 10:58am

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ఆమ్ ఆద్మీ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల(AAP 14th foundation day celebrations)ను జయప్రదం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్(District Convenor Nagula Arvind) అన్నారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ... ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) నవంబర్ 26వ తేదీ 2012 సంవత్సరంలో అరవింద్ కేజ్రీవాల్ కొంతమంది సభ్యులతో పార్టీని స్థాపించడం జరిగిందని తెలిపారు.

దేశంలో అవినీతిని అంతం చేయడం అందరికి ఉచిత విద్య, వైద్యం అందించడమే తమ పార్టీ లక్ష్యంమని  అన్నారు..ఈనెల 26వ తేదీన జిల్లా కేంద్రంలో బస్టాండ్ ఎదురుగా పార్టీ 14 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని వేడుకలకు పార్టీ జిల్లా, మండల, పట్టణ, గ్రామ, నాయకులు, పార్టీ శ్రేయోభిలాషులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని  అరవింద్ కోరారు.

మరిన్ని వార్తలు