రగ్బీ పోటీల్లో బాలికల సత్తా
23-11-2026 | 11:11am
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): నాగిరెడ్డి పేట కేజీబీవీ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు యుక్తేశ్వరి, జోష్ణలు అండర్-17 విభాగంలో టచ్ రగ్బీ(Touch Rugby ) ఆటలో హుజురాబాద్ (కరీంనగర్)లో జరిగిన క్రీడా పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి లో ప్రథమ బహుమతిని సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేక అధికారి,పీఈటీ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థినులను అభినందించి,రాష్ట్రస్థాయి పోటీలలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.