బిస్లరీ.. రెండో పరీక్షలోనూ హానికర రసాయనాలు

23-11-2026 | 10:34am

ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ బిస్లరీ (Bisleri)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీకి చెందిన తాగునీటి నమూనాల్లో హానికర రసాయనాలు ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. తొలుత నిర్వహించిన పరీక్షల్లో నీటిలో బ్రోమేట్ (Bromate) నిర్దేశిత పరిమితికి మించి ఉన్నట్లు ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) గుర్తించింది. దీంతో ఆ నమూనాను వినియోగానికి సురక్షితం కాదని ప్రకటించింది.

ఈ ఫలితాలపై బిస్లరీ సంస్థ అప్పీల్ (Appeal) చేయడంతో నమూనాలను మరోసారి పరీక్షల కోసం రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. రెండో పరీక్షలోనూ నీరు సురక్షితం కాదని తేలింది. ఈసారి పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) అనే రసాయనాలు ఉన్నట్లు ల్యాబ్ గుర్తించింది. దీంతో ఆహార భద్రతా చట్టం-2006 నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్ధారించింది. బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై క్రిమినల్ ప్రాసిక్యూషన్ (Criminal Prosecution) ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసింది. మరోవైపు వసంత్ మసాలా, టిట్-బిట్ ఫుడ్స్, మిమన్సా ఇండస్ట్రీస్, ఆశా కన్ఫెక్షనరీ సంస్థలపైనా చర్యలు తీసుకుంది. ఉర్మి లైఫ్‌సైన్సెస్, గౌర్ ఆయుర్వేదిక్ స్టోర్ సంస్థల లైసెన్సులను సైతం నిలిపివేసింది.

మరిన్ని వార్తలు