ఓటరు నమోదుకు మిగిలింది కొద్దిరోజులే!

30-10-2026 | 02:45pm

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణకాలనీ 6వ వార్డు మాజీ కౌన్సిలర్ ఎడ్ల మౌనిక కరాటే శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శుక్రవారం కాలనీలోని ప్రతి ఇంటిని సందర్శించి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన కల్పించారు.

పట్టభద్రుల ఓటరు నమోదు (Voter Registration)కు నవంబర్ 6 చివరి తేదీ కావడంతో అర్హులైన ప్రతి ఒక్కరూ గడువులోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు (Right to Vote)కు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ, ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదై రాబోయే ఎన్నికల్లో తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా యువజన నాయకులు కరాటే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు