బీజేవైఎం మండల అధ్యక్షుడిగా హేమంత్
గణపురం, నవంబర్ 25 (విజయక్రాంతి): గణపురం బీజేవైఎం మండల అధ్యక్షుడిగా చెల్పూర్కు చెందిన గద్దల హేమంత్(Gaddala Hemanth) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ గణపురం మండల పార్టీ ఆధ్వర్యంలో ఆయనను సన్మానించి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హేమంత్ మాట్లాడుతూ మండల యువత సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తూ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన బీజేపీ నాయకులు, బీజేవైఎం జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ మంద మహేష్, దుప్పటి భద్రయ్య, భాషావేణి నరేష్ యాదవ్, మామిడి శెట్టి సాంబశివుడు, బొద్దుల మొగిలి, నాయకపు నరసింహ, రాములు గౌడ్, చిలుమల్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.