చుక్కను పట్టి... యాసంగి పంటకు నీరు

25-11-2026 | 05:39pm

* ఫామ్ ఫండ్ నిర్మాణంతో భూగర్భ జలాలు...

* ఎల్ నినో పరిస్థితుల్లోనూ సత్ఫలితాలు ఇస్తున్న  ఫామ్ ఫండ్ ల నిర్మాణం..

* జిల్లా కలెక్టర్ రాజర్శి షా ప్రత్యేక కృషి..

ఉట్నూర్, నవంబర్ 25 (విజయక్రాంతి): ఎల్ నినో.. ఇప్పుడు అందరి అందరి నోట  వినిపించే మాట... వర్షాభావం వల్ల భయంకరమైన నీటి కొరత ఎదుర్కొన్నామని ప్రభుత్వం హెచ్చరిస్తుంది.. ప్రజలు నీళ్లను పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ... అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్శి షా(Collector Rajarshi Shah) ముందు చూపుతో ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.

జిల్లా డిఆర్డిఓ పిడి రాథోడ్ రవీందర్ కు పలు సూచనలు చేసి  వి బి జి రామ్ జి  పథకంలో నీటి పొదుపు కొరకు  ఫారం ఫండ్ ల తో పాటు వృధా నీటిని భూగర్భ జలాల్లో ఇంకే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు అమలు చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఆర్డిఓపిడి రాథోడ్ రవీందర్ మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేసి బివిజి రామ్ జి పథకంలో ఫామ్ ఫండ్లను నిర్మించాలని  మండల స్థాయి గ్రామస్థాయి అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు.

ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని గ్రామాల్లో నీటిని భూగర్భజలంలో ఇంకే విధంగా పనులు ముమ్మరంగా చేపట్టారు. ప్రతి రైతు చేనులో ఫామ్ ఫండ్ నిర్మించుకున్నందుకు దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు ఇవ్వడంతో పాటు రోజువారి కూలీలకు ఉపాధి కల్పించేందుకు మండల స్థాయి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. బివిజి రామ్ జి పథకంలో జాబ్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి పనులు కల్పించడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. చక్కటి అవకాశాన్ని రైతులు సద్వినియోగం  చేసుకోవాలని  అధికారులు రైతులకు సూచనలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు