ఓ చేత్తో బిడ్డ.. మరోవైపు దేశ బాధ్యత
ఆస్ట్రేలియా: సాధారణంగా పార్లమెంట్ సమావేశాలంటే వాడీవేడీ చర్చలు, రాజకీయ విమర్శలు కనిపిస్తాయి. కానీ ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఓ ఆసక్తికర దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. సెనేటర్ ఫాతిమా పేమన్ తన పసిబిడ్డను వెంట తీసుకుని పార్లమెంట్ సమావేశాలకు (Parliament Sessions) హాజరయ్యారు. సభా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే బిడ్డను ఒడిలోకి తీసుకుని మురిపించారు.
ఓవైపు దేశ ప్రజల కోసం చట్టసభలో బాధ్యతలు.. మరోవైపు బిడ్డకు అమ్మగా ప్రేమానురాగాలు! ఇలా రెండు బాధ్యతలను ఒకేసారి సమర్థంగా నిర్వహించిన ఆమె తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. మాతృత్వం (Motherhood), వృత్తిపరమైన బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ఆమె చూపిన చొరవ ప్రత్యేకంగా నిలిచింది.
ఈ అరుదైన దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్గా మారాయి. ఫాతిమా పేమన్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మహిళా సాధికారత (Women Empowerment), మాతృత్వానికి ఈ ఘటన ఓ చక్కని ఉదాహరణగా నిలుస్తోంది.