రీల్స్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి

06-10-2026 | 04:43pm
  1. సిద్దిపేట దశాబ్ది వేడుకల్లో పోటీలు
  2. రెండో బహుమతి రూ.50 వేలు
  3. ఈ నెల 11వరకు గడువు

సిద్దిపేట క్రైం, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : సిద్దిపేట జిల్లా దశాబ్ది వేడుకల్లో భాగంగా సోషల్ మీడియా వేదికగా రీల్స్, వీడియోల పోటీలు నిర్వహిస్తున్నట్లు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మచ్చ వేణుగోపాల్ రెడ్డి(BRS State Leader Macha Venugopal Reddy) తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు, అభివృద్ధిపై వీడియోలు రూపొందించి ఈ నెల 11లోగా @siddipetat10, @trsharish ఖాతాలను ట్యాగ్ చేయడంతో పాటు #siddipetAt10, #10yerasofsiddipetDIstrict హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించాలని సూచించారు.

వ్యక్తిగత ఖాతాలు, సోషల్ మీడియా పేజీలు, యూట్యూబ్ ఛానళ్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రత్యేక విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రెండు విభాగాల్లోనూ విజేతలకు మొదటి బహుమతి రూ.లక్ష, రెండో బహుమతి రూ.50 వేలు, మూడో బహుమతి రూ.25 వేలు అందజేస్తామన్నారు. 

ఉత్తమ ఫోటో, వీడియో జర్నలిస్టులకు కూడా బహుమతులు ఇస్తామన్నారు. విజేతల ఎంపిక కోసం ప్రముఖ కార్టూనిస్టు నెల్లుట్ల రమణారావు, పత్రికా సంపాదకులు రంగదాంపల్లి శ్రీనివాస్ గౌడ్, యూట్యూబ్ నిర్వాహకులు ఆకుల శ్రీనివాసరెడ్డితో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాకు చెందిన ప్రతిఒక్కరూ పోటీలో పాల్గొని జిల్లా దశాబ్ది వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని కోరారు.

మరిన్ని వార్తలు