పెంట్లవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు...
అవుట ఎర్ర శ్రీనివాసులు.
పెంట్లవెల్లి అక్టోబర్ 6: నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా(Pentlavelli Mandal Congress Party SC Cell President) అవుట ఎర్ర శ్రీనివాసులు(Outa Erra Srinivasulu) నియమితులయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వంకేశ్వరం నిరంజన్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని మంగళవారం అందుకున్నారు.
ఈ సందర్భంగా అవుట ఎర్ర శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు, జిల్లా మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.