ఎల్లమ్మ తల్లికి గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
18-10-2026 | 04:52pm
గణపురం, అక్టోబర్ 18 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎల్లమ్మ తల్లి దేవాలయంలో(Temple of Goddess Yellamma) ఆదివారం సద్దుల బతుకమ్మ పర్వదినం(Festival of Bathukamma) సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు(Special prayers) నిర్వహించారు. అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఎల్లమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.