పార్టీకి అండగా నిలిచిన డ్యాగల అంజయ్య
ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి.
ఆలేరు, అక్టోబర్ 18 (విజయక్రాంతి): పోలీసు నిర్బంధాలు(Police Detentions), ఒత్తిళ్ల సమయంలోనూ పార్టీకి అండగా నిలిచి, ప్రజల పక్షాన పోరాడిన నిబద్ధత కలిగిన నాయకుడు డ్యాగల అంజయ్య అని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) ఆలేరు మండలం మందనపల్లిలో డ్యాగల అంజయ్య 15వ వర్ధంతిని ఆయన స్థూపం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ గ్రామ కార్యదర్శి తమ్మడి అంజయ్య జెండా ఆవిష్కరించారు.
అనంతరం భిక్షపతి మాట్లాడుతూ అంజయ్య సర్పంచిగా గ్రామ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, ప్రజా సంక్షేమానికి అంకితమయ్యారని కొనియాడారు. ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలు ఎదురైనా సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ కార్యక్రమాలను నిబద్ధతతో నిర్వహించారని గుర్తుచేశారు. అంజయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కళ్లెపు అడివయ్య, న్యూడెమోక్రసీ భువనగిరి డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు పద్మ సుదర్శన్, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఆర్. సీత, మందనపల్లి ఉప సర్పంచి పద్మ శశిరేఖ, నాయకులు కుర్రి మార్కొండయ్య, తమ్మడి రమేష్, ఎలగందుల సిద్ధులు, మోతిలాల్, కడకంచి రమేష్, బీరయ్య, సుంచు రాములు, దార యాదగిరి, ఆర్. ఉదయ్, మాస్టర్ యతీంద్ర తదితరులు పాల్గొన్నారు.