కూసుమంచి లో ఘనంగా మహా అన్నదానం
కూసుమంచి, అక్టోబర్ 18 విజయక్రాంతి: కూసుమంచి గ్రామంలో(Kusumanchi Village) శ్రీశ్రీశ్రీ దుర్గామాత గౌడ్స్ ఐక్యత కమిటీ ఆధ్వర్యంలో అమ్మ భవాని స్వామి విజయలక్ష్మి సులోచన నాగరత్నం చేతిల మీదగా.. ఆలయం వద్ద ఘనంగా మహా అన్నదానం(Donation of food) నిర్వహించారు. అమ్మ భవాని స్వామి విజయ విజయలక్ష్మి(Vijayalakshmi) సులోచన, నాగరత్నం ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులు తో కలిసి భక్తులకు(devotees) అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పదని పేర్కొన్నారు. ఆకలితో ఉన్నవారికి కడుపునిండా భోజనం పెట్టడం ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు .
అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి ఆమె కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంద నాగులు మంద రాంబాబు, మంద శేఖర్, మంద ప్రసాద్, మంద చిన్న వెంకన్న, పెద్ద వెంకన్న, మంద నాగేశ్వరరావు, మంద నాగరాజు, జానకిరామ్ సాయి ఉదయ్ మల్లేశం మోహన్ రావు వేదాస్, ఉపేందర్ రెడ్డి , ఉపేందర్ , నాగేంద్రప్రసాద్, కిరణ్ అమ్మ భవాని భక్తులు తదితరులు పాల్గొన్నారు.