మెగా జాబ్ మేళాకు యువత హాజరు కావాలి
08-10-2026 | 04:58pm
గణపురం, అక్టోబర్ 08 (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరై ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గణపురం సర్పంచ్ కటుకూరి రాధిక శ్రీనివాస్ గురువారం కోరారు.
వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న ఈ మేళా యువతకు ఎంతో ఉపయోగకరమని ఆమె తెలిపారు. అర్హత కలిగిన యువత తమ విద్యార్హతల ధ్రువపత్రాలతో హాజరై అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.