13న జిల్లాకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు

11-10-2026 | 05:44pm

జాటోత్ హుస్సేన్ నాయక్

భూపాలపల్లి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్(National Commission for Scheduled Tribes) సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్(Jatoth Hussain Naik) ఈ నెల 13న భూపాలపల్లి జిల్లాలో(Bhupalpally District) పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Rahul Sharma) తెలిపారు. పర్యటనలో భాగంగా అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్‌లో ఎస్టీ వర్గాల ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

అనంతరం అన్ని శాఖల అధికారులతో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశానికి అన్ని శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమగ్ర నివేదికలతో హాజరు కావాలని సూచించారు.

మరిన్ని వార్తలు