పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి

04-11-2026 | 03:03pm
  1. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ 
  2. మహాదేవపూర్ పోలీస్ స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ

మహాదేవపూర్, నవంబర్ 04 (విజయక్రాంతి) : పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని  జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(District SP Sirisetti Sankeerth) అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్,  బుధవారం మహాదేవపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు.

మరిన్ని వార్తలు