జర్నలిస్టుల హక్కులే లక్ష్యం

11-10-2026 | 03:29pm

భూపాలపల్లి, అక్టోబర్ 11 (విజయ క్రాంతి): తెలంగాణలో టీయూడబ్ల్యూజే(TUWJ) బలమైన శక్తిగా ఉందని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్ పేర్కొన్నారు. ఆదివారం రేగొండ మండలం కోటంచలో యూనియన్ డివిజన్ సమావేశం(Union Division Meeting) నిర్వహించారు. ముందుగా ఆలయంలో రాష్ట్ర నాయకుడు తడక రాజనారాయణతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ లెనిన్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో 20 వేల అక్రిడిటేషన్ కార్డులు(Accreditation Cards) అందించామని తెలిపారు. ప్రస్తుతం జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, ఇంటి స్థలాలు(House Sites) అందేలా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడే సంఘం టీయూడబ్ల్యూజే ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. రూ.100 కోట్ల బడ్జెట్‌తో మీడియా అకాడమీ భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మంతెన సమ్మయ్య, నాగపురి శ్రీనివాస్ గౌడ్, బండి శ్రీనివాస్ గౌడ్, మోకిడి చిరంజీవి, వివిధ మండలాలకు చెందిన యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు