మండల వైస్ ప్రెసిడెంట్ గా నవీన్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక
తూప్రాన్, అక్టోబర్ 11, (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మండల కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా నక్కలపల్లి నవీన్ యాదవ్(Nakkalapalli Naveen Yadav), విలేజ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మన్నె రాములు(Manne Ramulu) అధికారికంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర నేత చిటుకుల మహిపాల్ రెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, ఫ్యాక్స్ చైర్మన్ భాస్కర్ రెడ్డి ప్రోద్బలంతో ఎన్నికైనందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్నికైన వారికి అధికారిక పత్రం అందజేస్తూ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఇందులో కాంగ్రెస్ ప్రెసిడెంట్ లు శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి, మున్సిపల్ ప్రెసిడెంట్ గరిగే నర్సింగరావు, సీనియర్ నేత సత్యనారాయణ, విశ్వరాజ్, అప్సర్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ఉప్పల యాదగిరి, మల్లా గౌడ్, యాదయ్య, నర్సింలు, రాజు, నెల్లూరు తదితరులు ఉన్నారు.