గీతన్నకు గుర్తింపు కార్డు

11-10-2026 | 04:26pm

రామారెడ్డి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): గీత కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు(Government Welfare Schemes), వివిధ ప్రయోజనాలు పొందాలంటే గీత కార్మిక గుర్తింపు కార్డు లేదా ఎక్సైజ్ లైసెన్స్(Excise License) కలిగి ఉండటం అవసరమని అధికారులు సూచిస్తున్నారు. తాటి, ఈత చెట్లు ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు జారిపడి మరణించినా, శాశ్వత దివ్యాంగులైనా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందించే రూ.5 లక్షల బీమా పరిహారం(Insurance Compensation) పొందేందుకు నిర్దేశించిన అర్హతలు, పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. అర్హులైన గీత కార్మికులు గుర్తింపు కార్డు పొందాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

గుర్తింపు కార్డు కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, వృత్తి ధ్రువీకరణ పత్రం, గీత కార్మిక సంఘం సర్టిఫికెట్ సమర్పించాలి. గీత కార్మిక వృత్తిలో ఉన్నట్లు స్థానిక గీత కార్మిక సంఘం లేదా సొసైటీ అధ్యక్షుడి సంతకంతో ధ్రువీకరణ పత్రం(Certificate) అందించాలి. ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. అవసరమైన పత్రాలతో మీ సేవా కేంద్రంలో(Meeseva Centre) దరఖాస్తు చేసుకోవచ్చు.

గుర్తింపు కార్డు ఉంటే చెట్లు ఎక్కే సమయంలో రక్షణ కోసం ప్రభుత్వం అందించే ఆధునిక కాటమయ్య రక్షణ కిట్లు(Katamayya Protection Kits), అర్హత ఉన్న 50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు పింఛన్(Pension), గీత కార్మికుల కార్పొరేషన్ లేదా బీసీ సంక్షేమ శాఖ ద్వారా లభించే రాయితీ రుణాలు(Subsidized Loans), ఇతర ఉపాధి పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. వృత్తి లైసెన్స్ పొందేందుకు కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది.

గుర్తింపు కార్డు కోసం గీత కార్మిక సొసైటీల ద్వారా ఎక్సైజ్ అధికారులు నిర్వహించే టాడీ ట్యాపింగ్ టెస్టింగ్(Toddy Tapping Test)లో, అంటే చెట్టు ఎక్కే పరీక్షలో, అర్హత సాధించాల్సి ఉంటుంది. కామారెడ్డి జిల్లాలోని గీత కార్మికులు ప్రభుత్వ పథకాల వివరాలను సంబంధిత అధికారుల వద్ద తెలుసుకుని, అర్హతలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు

మరిన్ని వార్తలు