బగలాముఖి దీక్షలో పబ్బ మహేష్ గుప్తా

11-10-2026 | 04:32pm

శివంపేట్ అక్టోబర్ 11(విజయక్రాంతి ) : మెదక్ జిల్లా(Medak District) శివంపేట మండలానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ జెడ్పిటిసి మరియు సామాజిక సేవాకర్త మహేష్ గుప్తా(Mahesh Gupta) ఆధ్యాత్మిక మార్గంలో భాగంగా బగలాముఖి దేవి దీక్షను ఆదివారం రోజున ఉదయం అమ్మవారి దేవస్థానం శివంపేట యందు అమ్మవారి ఉపాసకులు శ్రీశాస్త్రుల వెంకటేశ్వర శర్మ(Sri Sastrula Venkateswara Sarma) అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు(Special prayer rituals) నిర్వహించి పబ్బ మహేష్ గుప్తకు మాలధారణ స్వీకరింపజేశాడు.

హిందూ శాస్త్రాల(Hindu scriptures) ప్రకారం దశమహా విద్యల్లో ఎనిమిదవ శక్తి స్వరూపిని అయిన శ్రీ బగలాముఖి దేవి దీక్షను శత్రు నివారణ,కోర్టు కేసులు మరియు ఆటంకాల నుంచి ఉపశమనం కోసం,అలాగే సర్వజన వశీకరణ స్తంభన శక్తి సిద్ధి కోసం భక్తులు అత్యంత నిష్టతో స్వీకరిస్తూ ఉంటారు.ప్రజాసేవలో ఆక్టివ్ గా ఉండే పబ్బ మహేష్ గుప్తా ఈ కఠినమైన ఆధ్యాత్మిక సాధనను చేపట్టడం స్థానికంగా ప్రాధాన్యత సంచరించుకుంది. దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పబ్బ మహేష్ గుప్తా శ్రీ భగలాముఖి అమ్మవారి దీక్షను తొమ్మిది రోజులపాటు స్వీకరించడం దీక్షను స్వీకరించారు.

మరిన్ని వార్తలు