పొగాకు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి

02-11-2026 | 07:16pm
  1. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి
  2. కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి, నవంబర్ 2 (విజయ క్రాంతి): యువత పొగాకు, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) పిలుపునిచ్చారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో(IDOC Office) వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 4.0’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పాఠశాలలు, కళాశాలల్లో పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్వో వసంతకుమారి, ఆర్డీఓ హరికృష్ణ, డీఈఓ లలిత, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, డాక్టర్ దేవేందర్, మురళీధర్ రెడ్డి, డాక్టర్ సందీప్, డాక్టర్ నాగరాణి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు