వనరులను పొదుపుగా వాడాలి
రాజాపూర్ నవంబర్ 2 : వనరులను అవసరానికి మంచి వాడితే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి(District Educational Officer Vijayakumari) అన్నారు. సోమవారం రాజాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నీటిని ఎలా పొదుపుగా వాడాలో అవగాహన కల్పించారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్నినో ప్రభావాలు, వాతావరణ మార్పుల వల్ల కలిగే పరిణామాలు, ఎండ తీవ్రత నుంచి రక్షణ, నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై విద్యార్థులకు వివరించారు.
అనంతరం రాజాపూర్ కాంప్లెక్స్ సమావేశంలో పాల్గొని ఉపాధ్యాయులతో విద్యా సంబంధిత అంశాలపై చర్చించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపు, నాణ్యమైన విద్య, FLN కార్యక్రమాల అమలు పాఠశాలల్లో చేపట్టాల్సిన వివిధ విద్యా కార్యక్రమాలపై ఉపాధ్యాయులకు తగిన సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సుధాకర్,పాఠశాల ప్రధానోపాధ్యాయుల పాల్గొన్నారు.