మున్సిపాలిటీలో లెక్కలపై కలకలం

26-09-2026 | 05:40am

అద్దెల వసూళ్ల ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

రసీదు పుస్తకాలు స్వాధీనం

నగదు దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గద్వాల పుర కమిషనర్ వెల్లడి

గద్వాల టౌన్, సెప్టెంబర్ 25: గద్వాల పురపాలక సంఘం(Gadwal Municipality) రెవెన్యూ విభాగంలో ఐడీఎస్‌ఎంటీ దుకాణాల అద్దెల వసూళ్లకు స ంబంధించిన నగదు వ్యవహారం చర్చనీయా ంశంగా మారింది. అద్దెలు వసూలు చేసే బాధ్యతలు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాంప్రసాద్ వద్ద సుమారు 11 లక్షల రూ పాయలు నగదు లెక్కలు తేలాల్సి ఉన్నట్లు సమాచారం. గంట చిన్న కేశవస్వామి దేవాలయం సమీపంలో నివాసం ఉండే రాంప్రసాద్ పురపాలక రెవెన్యూ విభాగంలో విధులు నిర్వహిస్తూ ఐడీఎస్‌ఎంటీ దుకాణాల అద్దెలను వసూలు చేస్తున్నట్లు తెలిసింది.

వసూలైన నగదుకు సంబంధించి లెక్కల్లో తేడాలు గుర్తించడంతో అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో రాంప్రసాద్ ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడి డబ్బులు కోల్పోయినట్లు పురపాలక వర్గాల్లో చర్చ జరుగుతోంది.అద్దెల రూపంలో వసూలైన పురపాలక సంఘానికి చెందిన సుమారు 11 లక్షల రూపాయలు వినియోగించినట్లు సమాచారం.

ఈ విషయం వెలుగులోకి రావడంతో రాంప్రసాద్ బుధవారం రాత్రి ఆత్మహత్యకు యత్నించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పినట్లు తెలిసింది. రసీదు పుస్తకాల పరిశీలనవిషయం తెలిసిన వెంటనే పురపాలక అధికారులు రాంప్రసాద్ వద్ద ఉన్న రసీదు పుస్తకాలను స్వాధీనం చేసుకుని అద్దెల వసూళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.వసూలైన మొత్తం,మున్సిపల్ ఖాతాలో జమ చేసిన నగదు,ఇంకా జమ కావాల్సిన మొత్తంపై అధికారులు లెక్కలు సరిచూస్తున్నారు.

11 లక్షల రూపాయలు వాడుకున్న ఉద్యోగి తెలిపాడు.కమిషనర్ రాంప్రసాద్‌ఈ వ్యవహారంపై పురపాలక కమిషనర్ జానకీరామ్ సాగర్ వివరణ ఇస్తూ రాంప్రసాద్ సుమారు 11 లక్షల రూపాయలు మొత్తాన్ని వాడుకున్నట్లు తెలిపాడని పేర్కొన్నారు.ఈ విషయంపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.పోలీసుల విచారణ, పురపాలక శాఖ రికార్డుల పరిశీలన అనంతరం నగదు లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు