సర్వీస్‌ రోడ్డుపై ధాన్యం ఆరబెట్టొద్దు.!

24-11-2026 | 12:13am

* ప్రమాదాలకు కారణమైతే రైతులదే బాధ్యత

* మోతె ఎస్ఐ లచ్చిరెడ్డి హితవు

మోతె, నవంబర్ 23 (విజయక్రాంతి): హైవేపై ఉన్న సర్వీస్‌ రోడ్డుపై రైతులు ధాన్యం ఆరబెట్టవద్దని మోతె ఎస్ఐ బి.లచ్చిరెడ్డి(SI B Lacchireddy) హెచ్చరించారు. రహదారిపై ధాన్యం ఆరబెట్టడం వల్ల వాహనదారులకు ఇబ్బందులు కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ధాన్యం కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత రైతులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సర్వీస్‌ రోడ్డుపై ధాన్యం ఆరబెట్టకుండా సహకరించాలని కోరారు. చట్టాన్ని గౌరవించి, ప్రాణాలను కాపాడుకోవాలని ఎస్ఐ సూచించారు.

మరిన్ని వార్తలు