పాలెంలో వ్యవసాయ విద్యార్థుల స్టాల్
23-11-2026 | 11:35pm
బిజినేపల్లి, నవంబర్ 23: మండలంలోని పాలెం వ్యవసాయ కళాశాల(Palem Agricultural College) వద్ద వ్యవసాయ విద్యను అభ్యసించే విద్యార్థులు ఆహార పదార్థాలు, ఇండోర్ మొక్కలు ప్రత్యేక స్టాల్ ద్వారా విక్రయిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం వేళల్లో నిర్వహించే ఈ స్టాల్ వద్ద కళాశాలలోనే చిన్నారుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన చాక్లెట్లు, తృణ ధాన్యాల పొడులు, మునగాకు కారం, మునగ పొడులు, ఇంట్లో పెంచుకునే మొక్కలు లభిస్తున్నాయి. ప్రతి రోజు విద్యార్థులు వంతుల వారిగా విక్రయాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ స్టాల్ పెద్దగా విస్తరించనున్నట్లు విద్యార్థులు తెలిపారు.