పేకాట స్థావరంపై పోలీసుల దాడి..

23-11-2026 | 11:37pm

8 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్..

ఎర్రుపాలెం నవంబర్ 23 (విజయక్రాంతి): మండల పరిధిలోని నారాయణపురం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ఎర్రుపాలెం ఎస్‌ఐ రమేష్(SI Ramesh) తన సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న 8 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.44,360/- నగదు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని   పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు