ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా క్యాంపు ఏర్పాటు
ఖమ్మం టౌన్ నవంబర్ 23 (విజయక్రాంతి): నగరంలోని 4వ డివిజన్ పరిధిలోని యూపీహెచ్సీ (UPHC) కైకొండాయగూడెం స్టేజీ, హరిత గార్డెన్స్ ఎదురుగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Kutumba Jeevitha Bima Scheme) నమోదు క్యాంపును ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ నగర నాయకులు మడికంటి కృష్ణ గౌడ్ తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ క్యాంపును డివిజన్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అర్హులైన కుటుంబాలు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను తీసుకువచ్చి పథకానికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ప్రతి కుటుంబానికి భరోసాగా నిలుస్తుందని, డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ నాయకులు పథకంపై అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. ప్రజల సంక్షేమం కోసం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.