ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై అవగాహన

23-11-2026 | 11:39pm

ప్రజలకు మరింత చేరువగా మరో 10 కేంద్రాల ఏర్పాటు.. 

బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్

మేడిపల్లి, నవంబర్ 23 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం(Indiramma Jeevitha Bima Scheme) అమలుపై వివిధ పార్టీల నాయకులకు అవగాహన కల్పించేందుకు సోమవారం సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజ పాల్గొని పథకం ముఖ్య ఉద్దేశాలు, అమలు విధానం, ప్రజలకు అందించాల్సిన సేవలపై వివరించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో ఇప్పటికే 12 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు అదనంగా మరో 10 కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న నాయకుల విజ్ఞప్తి మేరకు అవసరమైన నెట్‌వర్క్, ఇతర ఏర్పాట్లు పూర్తి చేసి రాబోయే రెండు మూడు రోజుల్లో అదనపు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ సమావేశానికి బోడుప్పల్, పాత పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన మాజీ కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు హాజరై పథకం అమలుపై తమ అభిప్రాయాలు, సూచనలు ఇచ్చారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనాలు అందేలా నాయకులు, అధికారులు సమన్వయంతో  పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.

మరిన్ని వార్తలు