శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం

24-11-2026 | 12:12am

రుద్రంగి నవంబర్ 23 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) రుద్రంగి మండలకేంద్రంలోని ప్రహ్లాద పర్వతంపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం సోమవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ చైర్మన్ సామ మోహన్ రెడ్డి దంపతులు తలంబ్రాలు బియ్యం సమర్పించారు. సర్పంచ్ గండి నారాయణ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించగా, భక్తుల గోవిందా గోవిందా నామస్మరణల మధ్య స్వామివారి కల్యాణం ఘనంగా జరిగింది.

ఇట్టి కల్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దంపతులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్వామి వారి కల్యాణన్ని ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు దాతలకు గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు.లోక కల్యాణర్ధం నిర్వహించే స్వామి వారి జాతరా మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనలని అన్నారు. మంగళవారం జాతర బుధవారం రాథోత్సవ మహోత్సవనికి భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు..ఈకార్యక్రమలో ఆలయ కమిటీ సభ్యులు నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు