మల్యాలలో వింత కోడి

23-11-2026 | 11:45pm

మల్యాల, నవంబర్ 23 (విజయక్రాంతి): మల్యాల మండలం(Mallial Mandal)లో మూడు కాళ్ల కోడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మార్కండేయ గుడి సమీపంలోని చికెన్ సెంటర్‌లో దుకాణ నిర్వాహకుడు అశోక్ కోళ్లను పరిశీలిస్తుండగా ఈ వింత కోడి కనిపించింది. దాదాపు కిలోన్నర బరువున్న ఈ కోడి మిగతా కోళ్ల మాదిరిగానే సాధారణంగా నడుస్తుండటం విశేషం. దీంతో చికెన్ సెంటర్‌కు వచ్చిన వినియోగదారులు ఆసక్తిగా తిలకించారు. జన్యుపరమైన లోపాల కారణంగా అరుదుగా ఇలాంటి మూడు కాళ్ల కోళ్లు జన్మిస్తాయని మల్యాల పశువైద్యాధికారి డాక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు