వైరస్‌ల వ్యాప్తిలో జంతువుల పాత్ర కీలకం

02-11-2026 | 11:09pm

తెలంగాణ యూనివర్సిటీలో వైరస్‌లపై అవగాహన ప్రసంగం

భిక్కనూర్, నవంబర్ 2 (విజయ క్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయం(Telangana University) దక్షిణ ప్రాంగణంలోని జంతుశాస్త్ర విభాగంలో సోమవారం పాండిచ్చేరి యూనివర్సిటీ(Pondicherry University) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రజిని అనుపమ్‌ ఎమర్జింగ్ అండ్ రీ-ఎమర్జింగ్ వైరస్‌లపై ప్రసంగించారు. నిఫా, జైకా, ఇబోలా, హెచ్‌ఐవీ, సార్స్‌ కోవిడ్‌-19 వైరస్‌ల వ్యాప్తిలో జంతువుల పాత్రను వివరించారు.

ఈ వైరస్‌లపై పరిశోధనలకు అవసరమైన పరికరాలు, ప్రయోగశాల సదుపాయాల గురించి తెలియజేశారు. పరిశోధనల్లో బహుళ శాస్త్ర విధానం, వన్‌ హెల్త్‌ కాన్సెప్ట్‌ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో జంతుశాస్త్ర విభాగాధిపతి ప్రసన్న శీల, అధ్యాపకులు డాక్టర్‌ సునీల్‌ కుమార్‌, విజయ్‌ కుమార్‌, శ్రీకాంత్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు