మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘానికి క్రమశిక్షణ కమిటీ

17-10-2026 | 09:50pm

సంఘం సీనియర్ నాయకుడు రాయపూడి వెంకటనారాయణ హర్షం  

కోదాడ అక్టోబర్ 17(విజయక్రాంతి) : మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘానికి(Malidasa Telangana Activists Welfare Association) క్రమశిక్షణ కమిటీ(Discipline Committee) ప్రకటించడం జరిగింది. శనివారం కోదాడలో(Kodad) తెలంగాణ ఉద్యమకారుల సంఘం సీనియర్ నాయకుడు రాయపూడి వెంకటనారాయణ(Rayapudi Venkatanarayana) మాట్లాడుతూ మలి దశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యమకారుడు క్రమశిక్షణతో పని చేయుటకు మన ఉద్యమకారుల గుర్తింపుకై మన సమస్యలపై మన హక్కుల సాధనకై మనహక్కులను సాధించుకోవడం కోసం ప్రతి పిలుపును అందుకుంటూ క్రమశిక్షణతో ముందుకు పోవాలని క్రమశిక్షణ కమిటీ వేయడం జరిగిందన్నారు. రాయపూడి వెంకటనారాయణ , కుసుమ సిద్ధారెడ్డి ,ఎస్ డి హుస్సేన్ , భూపతి కొమరయ్య లను రాష్ట్ర అధ్యక్షుడు  ప్రకటించడం జరిగిందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సామ అంజిరెడ్డి ,ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడుగం నాగేశ్వరావు , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రఘునందన్ రెడ్డి లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు