చెరువుల పరిరక్షణకు కృషి
- మల్లెచెరువును పరిశీలించిన మెదక్ ఆర్డీవో రమాదేవి
రామాయంపేట,(విజయక్రాంతి): చెరువులు అన్యాక్రాంతం గాకుండా వాటి పరిరక్షణకు కృషి చేస్తామని మెదక్ ఆర్డీవో రమాదేవి(Medak RDO Ramadevi) పేర్కొన్నారు. శనివారం రామాయంపేటకు విచ్చేసిన ఆర్డీవో మల్లెచెరువు(Mallacheruvu) క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు.చెరువు పరిధిలోని పూర్తిస్థాయి సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేయాలని తహసీల్దార్కు సూచించారు.చెరువు క్రింద ఉన్న రైతులకు నీటి వనరులు అందుబాటులో ఉండేవిదంగా చర్యలు చేపట్టాలన్నారు. మల్లె చెరువు అన్యాక్రాంతం గాకుండా తాము నిరంతరం నిఘా వేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి, కమీషనర్ రవీందర్, ఇరిగేషన్ ఏఈ.సూర్యకాంత్ తదితరులు ఉన్నారు.