ట్రాఫిక్ సమస్యలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్
సుల్తానాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): ట్రాఫిక్ సమస్యలకు(Traffic problems) ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ ఎస్ఐ చంద్రకుమార్(SI Chandrakumar) హెచ్చరించారు. మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఆటో, జీప్ డ్రైవర్లకు(Auto and jeep drivers) అవగాహన కల్పించారు. అదేవిధంగా రేగడి మద్దికుంట,కొలనూర్, పెగడపల్లి,కాల్వ శ్రీరాంపూర్, గట్టేపల్లి,నీరుకుళ్ళ,కదంభాపూర్ గ్రామాలకు వెళ్లే ఆటోలకు నిర్దేశిత ప్రాంతాలను కేటాయించడం జరిగింది.
పట్టణంలో నిత్యం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రహదారులను వెడల్పు చేసినప్పటికీ కొందరు వాహనదారులు రహదారులపై అస్తవ్యస్తంగా వాహనాలను పార్కింగ్ చేస్తూ రాకపోకలు సాగించే వాహనాలతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని వివరించారు. ఇకముందు ఎవరైనా వాహనాలు రోడ్ల పై పార్కింగ్ చేసినట్లయితే జరిమానా లతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల తోపాటు పోలీసులు పాల్గొన్నారు.