బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
లింగంపేట్,(విజయక్రాంతి): ప్రభుత్వం పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిరాం యాదవ్ అన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్మోహన్రావు(MLA K. Madan Mohan Rao) ఆదేశాల మేరకు లింగంపేట మండల కేంద్రంలో శుక్రవారం బాధిత కుటుంబానికి సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు అత్యవసర వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్(CM Relief Fund check) ద్వారా కొండంత అండగా నిలుస్తోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో నియోజకవర్గంలోని అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ లింగంపేట పట్టణ అధ్యక్షుడు ప్రసాద్గౌడ్, కాంగ్రెస్ నాయకులు రఫీయుద్దీన్, సర్పంచి కౌడ రవి, బాలకిషన్, తుమ్మల శ్రీనివాస్రెడ్డి, ఎల్లమయ్య, దూర్ శెట్టి అశోక్, భాస్కర్ గౌడ్,ఎదుల్, లక్ష్మీనారాయణ, రవి, సునిల్, శంకర్, పీర్సింగ్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.