డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం
3 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టిన ఇందూరి విజయలక్ష్మి
భిక్కనూర్, నవంబర్ 12 (విజయ క్రాంతి): డ్రగ్స్ రహిత సమాజ(Drug-free society) నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని బిక్కనూర్ సీఐ నరేష్(Bikkanur CI Naresh) అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు 3 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టిన ప్రముఖ సైక్లిస్ట్ ఇందూరి విజయలక్ష్మి గురువారం తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణాన్ని సందర్శించారు.
లక్ష మంది విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఎస్సై అనిల్ మాట్లాడుతూ డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. నారాయణ గుప్త యువత మై భారత్ యాప్‌లో భాగస్వాములు కావాలని కోరారు.
ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ అంజయ్య బందేల స్వచ్ఛంద సేవ ద్వారా సమాజ మార్పునకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.