గో సేవా ఈ భాగంలో పరీక్ష

12-11-2026 | 07:38pm

నిర్మల్ నవంబర్ 11 ( విజయ క్రాంతి): సనాతన గో సంస్కృతి ఫౌండేషన్(Sanatana Cow Culture Foundation) గో సేవా విభాగ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గోవిజ్ఞాన పరీక్షకి విజయ హై స్కూల్ కి చెందిన 300 మంది విద్యార్థులు పాల్గొని పరీక్ష రాశారు. ఇందులో పదిమంది విద్యార్థులు రాష్ట్రస్థాయిలో నిర్వహించబోయే పరీక్షకి ఎంపికయ్యారు.

వీరు ఈనెల 15 వ తేదీన ఆదివారం రోజున కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ నారాయణగూడ హైదరాబాద్లో నిర్వహించే పరీక్షకి హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా ఎంపికైన  విద్యార్థులని పాఠశాల చైర్మన్ నల్ల  ఇంద్రకరణ్ రెడ్డి ,వైస్ ప్రెసిడెంట్ అంబారాణి ,జనరల్ సెక్రెటరీ అయ్యన్న గారి భూమయ్య,  ట్రెజరర్ ఆడెపు సుధాకర్ ,ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సిరమ్ ప్రతాపరెడ్డి, ఆమెడ కిషన్ ,కరస్పాండెంట్ మంచిరాల నాగభూషణం , ప్రిన్సిపల్ సామ మోహన్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు అభినందించారు.

మరిన్ని వార్తలు