బోల్డ్ సీన్లపై కియారా ఏమంన్నారంటే..?

12-11-2026 | 07:38pm

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani) తాజాగా తన సినిమా 'టాక్సిక్' ఫలితంపై, అందులోని బోల్డ్ సన్నివేశాలపై వచ్చిన విమర్శలపై స్పందించారు. భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'కాఫీ విత్ కరణ్-9'(Koffee With Karan Season 9) టాక్ షోలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

'టాక్సిక్'(Toxic Movie) ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం మొదట తనను తీవ్రంగా బాధించిందని కియారా తెలిపారు. ముఖ్యంగా సినిమా విడుదలైన తొలి వారాంతంలో నిరాశకు గురయ్యానని చెప్పారు. అయితే, తన పాత్రకు, కొత్త తరహా నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడం సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు.

ఇక హీరో యశ్‌తో చేసిన బోల్డ్ సన్నివేశాలపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ.. సిద్ధార్థ్ మల్హోత్రా వాటిని ఏమాత్రం పట్టించుకోలేదని వెల్లడించారు. ఈ విషయం గురించి తమ మధ్య ఎప్పుడూ చర్చ కూడా జరగలేదన్నారు. ఇలాంటి విమర్శలు దశాబ్దాలుగా నటీమణులు ఎదుర్కొంటున్నారని, అందులోని ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తూ చాలామంది స్పందించడంతో తాను ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని కియారా చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు