ఎన్విడియా సీఈఓ హువాంగ్ జెన్సన్ రాజీనామా
అమెరికా: ప్రపంచ ప్రముఖ ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్(CEO Jensen Huang) తన పదవికి రాజీనామా చేశారు. గురువారం నుంచి ఆయన రాజీనామా అమల్లోకి వచ్చినట్లు కంపెనీ బోర్డు ప్రకటించింది. సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కొలెట్ క్రెస్(Colette Kress) తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇటీవల జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత సంబంధాలపై పలు వార్తలు వెలువడ్డాయి. సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థ మాజీ ఉన్నతాధికారి ఆలిస్ హువాంగ్(Former Megaspeed executive Alice Huang)తో ఆయనకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమెపై చైనా గూఢచర్య(Chinese espionage) సంబంధాలున్నాయనే అనుమానాలతో అమెరికా దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఎన్విడియా ఉద్యోగితోనూ హువాంగ్‌కు సంబంధం ఉన్నట్లు మరో ఆరోపణ తెరపైకి వచ్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్విడియా బోర్డు స్వతంత్ర విచారణ చేపట్టింది. కంపెనీ రహస్యాలు లేదా అమెరికా జాతీయ భద్రతకు నష్టం జరిగినట్లు ఇప్పటివరకు ఆధారాలు లేవని సంస్థ గతంలో వెల్లడించింది. 1993లో ఎన్విడియాను స్థాపించిన హువాంగ్ సుమారు 33 ఏళ్ల పాటు సంస్థకు నాయకత్వం వహించారు. ఆయన రాజీనామాతో ప్రపంచ టెక్నాలజీ రంగంలో చర్చ మొదలైంది. శాశ్వత సీఈఓ ఎంపికపై కంపెనీ బోర్డు దృష్టి సారించింది.