ప్రజా ఉద్యమాల ధృవతార కామ్రేడ్ సీతారాం ఏచూరి
2వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్
కామారెడ్డి,(విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు ఉద్యమం(Indian Communist Movement)లో తనదైన ముద్ర వేసిన మహోన్నత నాయకుడు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన యోధుడు, ప్రముఖ మేధావి, సీపీఐ(ఎం) అఖిల భారత పూర్వ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి(Comrade Sitaram Yechury) వర్ధంతి సందర్భంగా ఆయనకు కామారెడ్డిలో శనివారం సిపిఎం నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ(CPM Party) కామారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి భారతదేశంలో వామపక్ష ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.
విద్యార్థి ఉద్యమం నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ అంచెలంచెలుగా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని, కార్మికులు, రైతులు, పేదలు, సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
కామ్రేడ్ సీతారాం ఏచూరి అమర్ రహే!
సీతారాం ఏచూరి ఆశయాలు వర్ధిల్లాలి!
ప్రజా ఉద్యమాలు వర్ధిల్లాలి! అని నినాదాలు చేశారు.