25ఏళ్ల ప్రజల కల నెరవేర్చుతాం.. ఎంపీ రఘునందన్‌రావు
క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీ రఘునందన్‌రావు
రామచంద్రపురం ఆగస్టు 12: రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్(Tellapur Division) పరిధిలోని తెల్లాపూర్ నుంచి విద్యుత్‌నగర్‌కు వెళ్లే మార్గంలోని రైల్వే అండర్ బ్రిడ్జి ఇరుకుగా ఉండటంతో గత 25 ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం లభించనుంది. సమస్యను గుర్తించిన మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కేంద్ర రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లి అండర్ బ్రిడ్జి అభివృద్ధి పనులకు రూ.21 కోట్లు మంజూరు చేయించారు.ఈ నేపథ్యంలో రైల్వే, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఎంపీ రఘునందన్‌రావు క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించారు.
అండర్ బ్రిడ్జి ఇరువైపులా ఉన్న కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనులపై పలు కీలక సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రామ్ బాబు గౌడ్,ఉపాద్యక్షులు కోటే రవి,మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు,కంజర్ల శ్రీశైలం, సీనియర్ బీజేపీ నాయకులు రవీందర్ రెడ్డి,ప్రవీణ్ యాదవ్, కాలనీ వాసులు,ప్రజాప్రతినిధులు