వృద్ధాశ్రమానికి విరాళం...
16-09-2026 | 08:28pm
తాడ్వాయి, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడువాయి మండలం ఎండ్రియాల గ్రామంలో నిర్మిస్తున్న వృద్ధాశ్రమానికి బిజెపి నాయకుడు పైడి ఎల్లారెడ్డి విరాళం(Donation) అందించారు. గ్రామానికి ఆయన బుధవారం చేరుకొని నిర్మిస్తున్న వృద్ధాశ్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధులు ఒకచోట కూర్చుండి తమ జీవిత విషయాలను మాట్లాడుకోవడానికి ఒక భవనం అవసరమని, ఇలాంటి వాటికి తాను కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొర్ని నర్సిములు,ఉప సర్పంచ్ నరసారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.