మణుగూరు ప్రభుత్వ ఐటిఐ/ఏటీసీలో వాకిన్ అడ్మిషన్స్
మణుగూరు, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మణుగూరు ప్రభుత్వ ఐటిఐ/ ఏ టి సి లో ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు 4వ విడత వాకిన్ అడ్మిషన్లుకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటిఐ ప్రిన్సిపాల్ ఓ సారంగపాణి(ITI Principal Sarangapani) తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లోని మెకానిక్ డిజిల్ ట్రేడ్లలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ప్రవేశాలు కోరుతున్నట్లు తెలిపారు.
అదేవిదంగా ఏటీసీలోని ట్రేడ్లలో ప్రవేశలాలు కోరుతున్నామన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్లు నేరుగా కాలేజీకి వచ్చి ప్రవేశం పొందవచ్చు అన్నారు. దరఖాస్తు చేసుకొని వారు సైతం తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కాలేజీకి వచ్చి ఆన్లైన్ చేసుకోవాలన్నారు. ఈ నెల 17 నుంచి 22వరకు కాలేజీ కి వచ్చి వాకిన్ లో నేరుగా ప్రవేశం పొందాలని తెలిపారు. ఉదయం 11గంటల లోపు కాలేజీ కి వచ్చి ప్రవేశం పొందాలన్నారు.
ఈ అవకాశాన్ని పినపాక నియోజకవర్గం పరిధిలోని విద్యార్థిని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకొని తమకు నచ్చిన ట్రేడ్లలో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. అడ్మిషన్ల కోసం https://iti.telangana.gov.in లో దరఖాస్తు చేసుకొని నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో కాలేజీకి వచ్చి నచ్చిన ట్రేడ్లో ప్రవేశం పొందవచ్చునని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు.