పాలెంలో దుర్గా మాత పూజలు
బిజినేపల్లి అక్టోబర్ 11 : మండలంలోని పాలెం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో(Palem Sri Venkateswara Swamy Temple) శరణనవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం దుర్గా మాత పూజలను ఫ్రెండ్స్ యూత్, పద్మావతి మాతృమండలి(Friends Youth, Padmavati Matrumandali) ఆధ్వర్యంలో నిర్వహించారు. దుర్గా అమ్మవారిని బాలాత్రిపుర సుందరి మాతగా విగ్రహ ప్రతిష్ఠ, అభిషేకాలను పురోహితులు జయంత్, చక్రవర్తుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.
సాయంత్రం, నిత్య పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం మహిళ భక్తులు బతుకమ్మ నిర్వహించారు. కార్యక్రమంలో ఓరుగంటి ఆనంద్ రజిత, జున్ను వెంకట నారాయణరెడ్డి రాములమ్మ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోవింద్ వెంకటేష్, అఖిలేష్, శ్రీను, అల్లోజీ, విఠల్, కార్తీక్, సాయిచరణ్, వినయ్, అర్చితు, ఆశ్రిత్, రాజేశ్వరి, బి.పద్మ, ఎస్.శారద, మంజుల, తదితరులు పాల్గొన్నారు.