రైతులకు మెరుగైన సేవలు అందిస్తాం

24-11-2026 | 08:40pm

భిక్కనూర్ (విజయ క్రాంతి): బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Primary Agricultural Cooperative Society) (సొసైటీ) ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని సొసైటీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం సొసైటీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రైతులకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులు, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని సభ్యులు నిర్ణయించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సేవలు సకాలంలో అందించాలని పలు తీర్మానాలు చేశారు. సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేస్తామని అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సొసైటీ సీఈఓ మోహన్ గౌడ్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు