మృతురాలి కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సాయం
ఉదారతను చాటుతున్న సర్పంచ్ ప్రవీణ్
సింగరేణి నవంబర్ 24 విజయ క్రాంతి: సింగరేణి మండలం అప్పాయిగూడెంలో(Appayigudem) అనారోగ్యంతో మృతి చెందిన ఎట్టి వీరమ్మ కుటుంబానికి సర్పంచ్ దండు ప్రవీణ్ ఆర్థిక సాయం అందజేశారు. వీరమ్మ మృతి విషయం తెలుసుకున్న సర్పంచ్, వీరమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆమె కుటుంబానికి రూ. 5వేలు అందజేశారు.
గ్రామ పంచాయతీ లో మృతిచెందిన కుటుంబాలకు సర్పంచ్ దండు ప్రవీణ్ స్వాంతన నిధి ఏర్పాటు చేసి స్వంతంగా రూ. 5 వేలు అందజేస్తూ తన ఉదారతను చాటకుంటున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ దండు ప్రవీణ్ మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా మృతిచెందినప్పుడు బాధిత కుటుంబాలు ఇబ్బంది పడ వద్దనే ఉద్దేశంతో సొంతగా సాంత్వన నిధిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎట్టి సంధ్య రాణి, వార్డు సభ్యులు వాంకుడోత్ రమేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.