విద్యుత్ సరఫరాకు అంతరాయం

24-11-2026 | 08:26pm

వెంకటాపురం, నూగూరు, అక్టోబర్ 24, విజయక్రాంతి: వెంకటాపురం టౌన్‌లో(Venkatapuram Town) బుధవారం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు, వెంకటాపురం టౌన్ మెయిన్ రోడ్డుతో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.

ఈ పనులను విద్యుత్ శాఖ సిబ్బంది హైడ్రాలిక్ మిషన్ సహాయంతో నిర్వహించనున్నందున, భద్రతా కారణాల దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.వెంకటాపురం టౌన్ కి మాత్రమే అంతరాయం ఉంటుంది మిగిలిన ప్రాంతాల్లో వారికి అంతరాయం ఉండదు.  కావున విద్యుత్ శాఖ చేపట్టే ఈ నిర్వహణ పనులకు సహకరించి, తాత్కాలిక విద్యుత్ అంతరాయానికి సహకరించ వలసిందిగా ఏ ఈ కోరడం జరిగింది.

మరిన్ని వార్తలు