అత్యంత వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

24-11-2026 | 08:30pm

మహా అన్నదాన ప్రసాదం అందించిన డాక్టర్ శ్రీనివాస్ దంపతులు

వెల్దుర్తి నవంబర్ 24 (విజయక్రాంతి): వెల్దుర్తి మండలం బస్వాపూర్(Baswapur) గ్రామంలో శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున ఆలయంలో మండల ప్రజలు కార్తీక పౌర్ణమి వేడుకలను మంగళవారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ప్రజలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వయంభుగా వెలసిన పుట్టు లింగానికి భక్తులు అభిషేకాలు జరిపారు. సాయంత్రం వేళ మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాల వద్దకు చేరుకొని కార్తీక దీపాలను వెలిగించారు.

అలాగే తమ గృహాల వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు కుటుంబ సభ్యులతో ఆలయాలకు చేరుకోవడంతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. దేవాలయం వద్ద వెల్దుర్తి వాస్తవ్యుడు అయిన డాక్టర్ చిప్ప శ్రీనివాస్ వారి తండ్రి స్వర్గీయ డాక్టర్ చిప్ప నరసింహులు జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అన్నప్రసాదను తీసుకొని అన్న ప్రసాదంను ఏర్పాటుచేసిన డాక్టర్ చిప్ప శ్రీనివాస్, దంపతులను భక్తులు అభినందించారు. ప్రతి ఏటా జరిగే కార్తీక పౌర్ణమి రోజు ఈ మహా అన్నప్రసాదాన్ని  భక్తుల కొరకు అందిస్తానని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

మరిన్ని వార్తలు