జుక్కల్‌లో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ
జుక్కల్, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి) : తెలంగాణ చరిత్రలో కీలకమైన సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన(Telangana Peoples Governance) దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోంది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంతో ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమైన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన చారిత్రక ఘట్టాన్ని, ప్రజల హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం పోరాడిన రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, సామాన్య ప్రజలు, అమరవీరుల త్యాగాలను వారు స్మరించుకున్నారు.
స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు మల్లికార్జున్, స్థానిక నాయకులు సతీష్ పటేల్, రమేష్, మద్నూర్ ఏఎంసీ చైర్మన్ సౌజన్య రమేష్, సాయ గౌడ్, గంగు నాయక్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.