రేవంత్ రెడ్డిలా డిగ్రీలు చదినవారు.. రాష్ట్రంలో కోటిమంది?
రేవంత్ బినామీ పేరు బయటపెట్టిన కేటీఆర్
హైదరాబాద్: సెప్టెంబర్, 17 జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. తాను హార్వర్డ్ వర్సిటీలో చదివానని సీఎం చెబుతున్నారని, తనకు వీసా ఇవ్వరా? అని సీఎం రేవంత్ రెడ్డి వాపోతున్నారని చమత్కరించారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాదిరిగా డిగ్రీలు చదివిన వారు రాష్ట్రంలో కోటి వరకు ఉంటారేమో? అని కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లో ఇల్లు కట్టడమెలా? అని వారికి చెప్పవచ్చు కదా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తిరిగిన కారు కేఎల్ శ్రీధర్ రెడ్డిది(KL Sridhar Reddy) కాదా? తిరుపతిరెడ్డి తిరుగుతున్న కారు కేఎల్ఎస్ సంస్థది కాదా? కేఎల్ ఎస్ఆర్ మీ బినామీ అని మాకు తెలియదా? అని కేటీఆర్ స్పష్టం చేశారు.